Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Written By సెల్వి
Updated: గురువారం, 17 సెప్టెంబరు 2026 (11:12 IST)
Heavy Rain
తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 
 
ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
 
రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణంగా 664.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 536.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments