సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (18:39 IST)

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆల్ టైమ్ రికార్డు...

Yadagiri
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం 35 రోజుల పాటు హుండీ ఆదాయంగా రూ.3,93,88,092-00 (రూ. మూడు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై రెండు) నికర నగదును పొంది ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 
 
ఇందులో 174 గ్రాముల మిశ్రమ బంగారం, ఏడు కిలోల మిశ్రమ వెండితో పాటు అమెరికా నుండి 1359 డాలర్లు, 25 ఆస్ట్రేలియన్ డాలర్లు వచ్చాయి. 
 
ఇంగ్లాండ్ నుండి 55 పౌండ్లు, యూఏఈ నుండి 65 దిర్హామ్‌లు, యూరోప్ నుండి 20 యూరోలతో పాటు నేపాల్ నుండి 10, 30 కెనడియన్ డాలర్లు వచ్చాయి. గతంలో ఆలయ హుండీ రికార్డు 35 రోజులకు రూ.2.82 కోట్ల నికర నగదు కావడం గమనార్హం.