ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (09:22 IST)

తెలంగాణలో వెయ్యి మందికి ఒక పోలింగు కేంద్రం

తెలంగాణలో పోలింగు కేంద్రాలను హేతుబద్ధీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి పోలింగు కేంద్రంలో సాధ్యమైనంత తక్కువ మంది ఓటర్లు ఉండాలని భావిస్తోంది. 

గతంలో ఒక్కో కేంద్రం పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 1,500 మంది.. గ్రామాల్లో 1,200 మంది ఓటర్లు ఉండాలని ఉత్తర్వులిచ్చింది. తాజా నిబంధనల మేరకు వెయ్యి మందికి ఒక పోలింగు కేంద్రం ఏర్పాటు చేస్తారని అధికారుల అంచనా. ఈమేరకు రాష్ట్రంలో బూత్‌ల సంఖ్య పెరుగుతుంది.

ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒక కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వారంతా ఒకే కేంద్రం పరిధిలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఈసీ పేర్కొంది.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబరులో ఉప ఎన్నిక జరగనుంది. అప్పటికి ఎన్నికల కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,707 పోలింగు కేంద్రాలు ఉన్నాయి.