తెలంగాణలో నేటి నుంచి బోటింగ్

boating
ఎం| Last Updated: గురువారం, 1 అక్టోబరు 2020 (09:31 IST)
తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో గురువారం నుంచి బోటింగ్, టూరిజం బస్సు సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు కరోనా నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గురువారం నుంచి పురాతత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

క్రీడా మైదానాలు, మ్యూజియంలు రేపటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. అయితే ఆయా ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
దీనిపై మరింత చదవండి :