మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (17:00 IST)

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో పలు చోట్ల మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇక హైదరాబాద్‌లో రాగల కొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

అత్యవసరం అయితే 100కు, 040-21111111 నంబర్‌కు, డీఆర్‌ఎఫ్‌ బందాల కోసం 040-295555500 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.