గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 3 జులై 2021 (20:03 IST)

ఈటల రాజేందర్‌కు మరో కష్టం, తెలంగాణ సర్కార్ భారీ షాక్?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కొత్త కష్టం మొదలైనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఏసీబీ రంగంలోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి.
 
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అధికారులు అరా తీస్తున్నారు. ఈ మేరకు పలు డాక్యుమెంట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.
 
దీన్ని బట్టి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కొత్త కష్టం మొదలైనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఏసీబీ రంగంలోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ ఈరోజు తనిఖీలు మొదలు పెట్టింది.

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఈటెల రాజేందర్ పైన ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధుల గోల్‌మాల్ జరిగిందని ఫిర్యాదు అందింది. ఈ నిధుల లెక్కల తేడాలలో ఈటల హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి.