గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (09:15 IST)

నుపుర్ శర్మను ఉరితీయాలి.. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు.. అసదుద్ధీన్ ఓవైసీ

asaduddin owaisi
ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ గత శుక్రవారం నుపుర్ శర్మను ఉరితీయాలంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదమైనాయి. ఈ వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్ శర్మను ఉరితీయాలన్న సొంత ఎంపీ అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. 
 
''దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు'' అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 
 
మరోవైపు ఇంతియాజ్ వ్యాఖ్యలను శివసేన కూడా ఖండించింది. ఆ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ ''ఇంతియాజ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వీటిని ఖండించాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి సందర్భంలో రెచ్చగొట్టే బదులు శాంతియుతంగా, సంయమనంతో ఉండాల్సింది'' అని ప్రియాంకా చతుర్వేది ట్విట్టర్‌లో పేర్కొన్నారు.