కేసీఆర్ రిటైర్ కాకుంటే.. కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడు..  అరవింద్  
                                       
                  
				  				   
				   
                  				  టీఆర్ఎస్ పార్టీ పై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికలపై ప్రస్తావిస్తూ.. బీజేపీ విజయంతో తెరాస పార్టీలో లుకలుకలు ఏర్పడుతాయని..  స్వయంగా ఆయన కొడుకు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
				  											
																													
									  
	 
	ప్రజలను,  ఓట్లను కొనుక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిదని, హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా… ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అవినీతి, అహంకారం టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు దారి తీస్తున్నదని హెచ్చరించారు.  కేసీఆర్ శకం ముగిసిందని.. త్వరలో ఆయన రిటైర్ కావాలని లేకపోలే ప్రజలే ఆ పని చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీ, మోదీ నాయకత్వంతోనే సాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. 
				  
	 
	దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ గెలుపుతో తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతుందని అరవింద్ అన్నారు. తెలంగాణలో గత ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో అనేక మంది బీజేపీలో చేరబోతున్నారని జోస్యం చెప్పారు.