గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (17:58 IST)

కలెక్టర్ అనితకు త్రుటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో కలెక్టర్ అనిత రామచంద్రన్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. కలెక్టర్ అనిత రామ చంద్రన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
 
వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో.. అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి భువనగిరి వస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.