Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత దేహాలకు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయాల్సిందే

Updated: గురువారం, 14 మే 2020 (17:33 IST)
కొద్ది వారాల క్రితం మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే 3వ స్టేజీకి వెళ్లే ప్రమాదం ఉందని పిటీషనర్ వాదన. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్ట్ మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ నెల 26వ తేదీ వరకు స్పష్టమైన నివేదికను సమర్పించాలని ఆజ్ఞాపించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments