ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:53 IST)

అబ్బా.. సైబర్ నేరాలు... ఏకంగా రూ.8లక్షల భారీ మోసం..

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది లక్షల రూపాయల మోసం చోటుచేసుకుంది. ఒక చోట జియో మార్ట్ పేరుతో లక్ష రూపాయల మోసం జరుగగా.. మరో చోట ఓఎలెక్స్ పేరుతో రెండు లక్షల మోసం జరిగింది. ఇక ఓటిపి, కేవైసి పేరుతో 10 మంది నుండి 5 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు హైదరాబాద్ పాలీసులకు ఫిర్యాదులు అందాయి.
 
ఓ వ్యక్తి డెబిట్ కార్డ్ కొనిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఢిల్లీలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఆన్లైన్ వేదికగా కూడా సైబర్ నేరస్థులు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆన్లైన్ డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి మహిళను వేధించడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోమవారం నమోదైన కేసుల పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.