మల్లేశం ఫోటో వైరల్.. కంబాలపల్లి కథలు వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్నాడుగా..

KambalapallyKathalu
సెల్వి| Last Updated: ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (17:24 IST)
KambalapallyKathalu
మల్లేశం సినిమాతో హీరోగా నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు ప్రియదర్శి. తనదైన కామెడీ టచ్‌తో అందరినీ అలరించిన ప్రియదర్శి ఇపుడు కంబాలపల్లి కథలు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్దమవుతున్నాడు.

దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హైబత్ రోల్‌లో నటిస్తున్నాడు. వరంగల్ సమీపంలోని కంబాలపల్లి అనే కుగ్రామం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ షురూ అయింది.

నేడు కంబాలపల్లి కథలు ప్రపంచంలోకి.. అంటూ క్లాప్‌ను పట్టుకున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రెస్ లుక్‌లో ప్రియదర్శి కనిపిస్తున్న స్టిల్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిపై మరింత చదవండి :