శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (17:12 IST)

హౌస్‌ఫుల్‌ ఛాన్స్ కావాలంటే.. నా ముందు దుస్తులు విప్పాల్సిందే.. ఎవరు?

model Paula
బాలీవుడ్‌లో ఇప్పటికే సుశాంత్ సింగ్ మరణంతో నెపోటిజంపై చర్చ సాగుతోంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రియా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకంపై కూడా పెద్ద రచ్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై ప్రముఖ మోడల్‌ పాలా తీవ్ర ఆరోపణలు చేసింది. 
 
గతంలో తనపట్ల సాజిద్‌ దారుణంగా ప్రవర్తించాడని చెప్పింది. రెండేళ్ల క్రితం దేశంలో మీటూ ఉద్యమం మొదలైనప్పుడే.. ముగ్గురు మహిళలు సాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో హౌస్‌ఫుల్‌ 4 నిర్మాతలు సాజిద్‌ను ప్రాజెక్టు నుంచి తప్పించి, మరొకర్ని తీసుకున్నారు. 
 
ఇన్నాళ్ల తర్వాత.. మోడల్‌ పాలా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యం చనిపోవడానికి ముందు, భావాల్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను నిషేధించడానికి ముందే.. తనకు జరిగిన ఘోరాన్ని బయటపెట్టాలనిపించింది.. అనే క్యాప్షన్‌ ఇస్తూ.. ఓ పోస్ట్‌ చేసింది. సాజిద్‌.. తనతో చాలా అభ్యంతరకరంగా 
ప్రవర్తించాడని, ముట్టుకునేందుకు ప్రయత్నించాడని పాలా ఆరోపించింది. 
 
హౌస్‌ఫుల్‌ సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలంటే.. తన ముందు దుస్తులు విప్పాలని అడిగాడని చెప్పింది. ఆయన ఇంత దారుణంగా ఎంత మంది అమ్మాయిలతో ప్రవర్తించాడో ఆ దేవుడికే తెలియాలని పాలా వాపోయింది. ఇలాంటి క్రూరులు ఊచలు లెక్కపెట్టాలని, శిక్ష అనుభవించే తీరాలని పాలా డిమాండ్‌ చేసింది.
 
సాజిద్‌ ఖాన్‌ వేధించినట్టు మీటూ ఉద్యమ సందర్భంలో చాలామంది అమ్మాయిలు చెప్పారని.. పాలా గుర్తుచేసింది. కానీ అప్పుడు చెప్పే ధైర్యం చేయలేదని పాలా పేర్కొంది. గాడ్‌ ఫాదర్‌ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన తాను.. కుటుంబాన్ని పోషించుకునేందుకు మౌనంగా ఉన్నానని చెప్పింది.