మళ్లీ హైదరాబాదులోనే... రూ. 33 లక్షల విలువ చేసే రూ. 2000 నకిలీ నోట్లు
టెక్నాలజీ అంటే హైదరాబాదులోనే అంటుంటారు చాలామంది. అవసరమైన టెక్నాలజీయే కాదు... మోసం చేసే టెక్నాలజీ కూడా ఇక్కడ ఎక్కువేనని చెపుతుంటారు. తాజాగా రూ. 2000 నకిలీ నోట్లు పట్టుబడటంతో హైదరాబాద్ లోని టెక్నాలజీ రాయుళ్లు ఎంతగా ముదిరిపోయారో అర్థమవుతుంది. నరేంద్ర మో
టెక్నాలజీ అంటే హైదరాబాదులోనే అంటుంటారు చాలామంది. అవసరమైన టెక్నాలజీయే కాదు... మోసం చేసే టెక్నాలజీ కూడా ఇక్కడ ఎక్కువేనని చెపుతుంటారు. తాజాగా రూ. 2000 నకిలీ నోట్లు పట్టుబడటంతో హైదరాబాద్ లోని టెక్నాలజీ రాయుళ్లు ఎంతగా ముదిరిపోయారో అర్థమవుతుంది. నరేంద్ర మోదీ పాత నోట్లను రద్దు చేసి ఈ స్థానంలో రూ. 2000 నోట్లను విడుదల చేశారు. ఈ నోటును చూసినవారు ఆదిలోనే గేలి చేశారు.
ఈ కరెన్సీ నోటు పిల్లలు ఆడుకునే జాలీ నోటు అంటూ ఎద్దేవా చేశారు. కాగా 2000లో ఎలాంట సెక్యూరిటీ ఫీచర్లు లేవని కేంద్రం స్పష్టం చేయండో నకిలీ నోట్లు ముద్రించేవారు రంగంలోకి దిగారు. అలా మొత్తం 33 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ నోట్లను తయారుచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆరుగురు సభ్యులు కలిగిన ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.