సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (19:28 IST)

ఐఎస్‌బి గగనతలంపై డ్రోన్ల నిషేధం : సీవీ ఆనంద్ హెచ్చరిక

narendra modi
ఈ నెల 26వ తేదీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)‌ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఈ క్యాంపస్ గగనతలంపై రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లు ఎగురవేయడాన్ని నిషేధించారు. 
 
ఐఎస్‌బి క్యాంపస్ ఉండే ఐదు కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది.
 
ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఈ అదేశాలు ఉల్లంఘించే వారిపై ఐపీసీ 188, సెక్షన్ 121, 121 (A), 287, 336, 338 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.