Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ పాజిటివ్‌-సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Written By సెల్వి
Updated: గురువారం, 27 జనవరి 2022 (13:24 IST)
కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్‌ కానాజీగూడలోని మానస సరోవర్‌ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అలేఖ్య అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది.
 
అప్పటి నుంచి అలేఖ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కానీ ఈ నెల 23వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments