గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (15:53 IST)

కవిత కారుకు ప్రమాదం.. రేంజ్ రోవర్ నుజ్జునుజ్జు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
కాన్వాయ్‌ తుఫ్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే కారును కాన్వాయ్‌లోని రేంజ్‌ రోవర్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే ఆ కారులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు.