గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (23:05 IST)

తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్- ఆగష్టు 5 నుంచి 15వ తేదీ వరకు...?

golkonda
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో నేటి నుంచి ఆగష్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
అయితే.. ఈ నెల 5 నుంచి 15 వరకు ఫ్రీ ఎంట్రీకి చాన్స్ ఉంటుందని వెల్లడించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం నుంచి చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప ఆలయం ఉన్నాయి.
 
ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. అయితే.. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.
 
అయితే ఆఫర్‌ను 75వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా చార్మినార్, గోల్కొండ కోటకు ఫ్రీగా సందర్శించేందుకు అవకాశం కల్పించేందుకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.