సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (17:35 IST)

భర్త అంత్యక్రియలు ముగిశాయి.. ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు..

baby legs
గుండెపోటు రూపంలో భర్తను యముడు బలితీసుకున్నాడు. అసలే నిండు గర్భవతి. ఆమెకు భర్తను దూరం చేశాడు దేవుడు. అయితే భర్త చనిపోయి అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే పురిటి నొప్పులు భరిస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన సాన సత్యలక్ష్మి, రాములు కుమారుడు బాలకిషన్ (28) (భాను) బీఫార్మసీ పూర్తిచేశాడు. మూడేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్రవంతితో వివాహం జరిగింది. బాలకిషన్ సిద్దిపేటలోని ఓ మెడికల్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టింది ఏమో ఈ నెల 26వ తేదీన బాలకిషన్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
అప్పటికే బాలకిషన్ భార్య స్రవంతి నిండు గర్భవతి. కడుపులో ఉన్న బిడ్డను మోసూ భర్త అంత్యక్రియల్లో పాల్గొన్న స్రవంతి దయయ స్థితికి ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. శనివారం జరిగిన అంత్యక్రియల దుఃఖం నుంచి తేరుకోక ముందే నిండు గర్భవతి స్రవంతికి పురుటినొప్పులు ప్రారంభయయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు దు:ఖాన్ని దిగమింగుతూనే కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు.
 
శనివారం రాత్రి పడ్డంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న కానరాని లోకాలకు వెళ్లి పోయావు. ఈ రోజు కొడుకు రూపంలో మళ్లీ జన్మించావు.. అంటూ ఆమె రోదించడం అక్కడున్న వారిని కలచివేసేంది.