సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (17:51 IST)

హైదరాబాద్ భారీ వర్షం: ఆడుకుంటూ సెల్లార్ నీటిలో పడి బాలుడు మృతి

దిల్ షుక్ నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్ లోకి నీరు వచ్చి చేరింది.
 రాత్రి అందరూ ఇంట్లో ఉన్నారు. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు.
 
ఇది గమనించి బాబు తండ్రి యుగేందర్ కిందకు వెళ్ళాడు. అప్పటికే బాబు నీళ్లలో పడి చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడు అని చెప్పడంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.