శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (17:53 IST)

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

Ujjal Bhuyan
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం హైకోర్టు సీజేగా వ్యవహరిస్తున్న సతీశ్ చంద్ర ఢిల్లీ హైకోర్టుకు బదిలీకానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సిఫార్సు చేసింది. 
 
తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి హైకోర్టులకు కూడా కొత్త సీజేలను ప్రతిపాదిస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. అయితే, తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్న ఉజ్జల్ ప్రస్తుతం ఇదే హైకోర్టు ఓ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. తెలంగాణ సీజే సతీశ్ శర్మను బదిలీ చేసి, జస్టిస్ భుయాన్‌కు పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది.