1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (13:03 IST)

అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు

telangana state
తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 221 పనిరోజులతో షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది. జులై 1వ తేదీ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభించనున్నట్లు బోర్డు ప్రకటించింది. 
 
జూన్ 15న రెండో సంవత్సరం క్లాసులు ప్రారంభంకానున్నట్లు తెలిపింది. అక్టోబరు 2-9వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13-15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఫిబ్రవరి 6-13 మధ్య ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు నిర్వహించనుంది.
 
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు బోర్డు పేర్కొంది. 
 
ఈ ఏడాది నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. 
 
గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మే నెలాఖరుకల్లా టీఎస్ సీపీజీఈటీ 2022 నోటిఫికేషన్ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
Telangana Inter Academic Calendar released