తెలంగాణ కోసం కేంద్రం రూ.7,778 కోట్లు కేటాయించాలి: కేటీఆర్

Written By సెల్వి
Updated: గురువారం, 20 జనవరి 2022 (23:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్‌లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ , మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. నార్సింగిలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌తో మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌తో కూడా అనుసంధానించబడుతుందని ఆయన అన్నారు. 
 
వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్లు (20 శాతం) కావాలని కోరుతూ, టైర్-2 నగరంలో ప్రజా రవాణాలో ఈ ప్రాజెక్ట్ ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. "మేక్ ఇన్ ఇండియా", "ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్" అనే కేంద్రం విధానానికి అనుగుణంగా తెలంగాణాలో మెట్రో-నియో కోచ్‌లను తయారు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని ఆయన చెప్పారు.

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments