శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (20:39 IST)

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన... ఏమన్నారంటే..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 20 సంవత్సరాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఆటుపోట్లు చూసిందన్నారు. ఎన్నికల్లో స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌ పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. 
 
హుజూరాబాద్‌ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని, ఈ ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక కోసం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల బాగా శ్రమించారని కొనియాడారు. అలాగే ఎమ్మెల్యేలు నేతలు, కార్యకర్తలతో పాటు సోషల్‌ మీడియా వారియర్స్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు
 
ఇకపోతే దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. ఈటల తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు.