కేసీఆర్ వల్ల ప్రాణహాని.. హైకోర్టులో రేవంత్ పిటిషన్
సీఎం కేసీఆర్, ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ పారిశ్రామిక వేత్త నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఆయన వినతిపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
కేంద్ర లేదా స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4+4 గన్‌మెన్‌తో పాటు ఎస్కార్ట్ భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ కోర్టును ఆశ్రయించారు. కాగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు.
ఆయనతో పాటు కేసులో సహనిందితులుగా ఉన్న మరి కొందరు కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.