Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వైద్య విద్యార్థిని ప్రీతి బ్రెయిన్ డెడ్ - ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!?

Written By వరుణ్
Updated: ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (18:52 IST)
వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 
 
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సైనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగా, ఆమె ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments