శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (12:50 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ చార్జిషీటులో ఎమ్మెల్సీ కవిత భర్త పేరు

kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత మెడకు చుట్టుకునేలా వుంది. ఈడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన చార్జిషీటులో కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా ఉంది. పైగా, ఈ ఢిల్లీ స్కామ్‌లో కవిత కీలక సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అదేసమయంలో ఆమె భర్త అనిల్ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. 
 
లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లైపై ఈడీ కీలక అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ హవాలా ద్వార ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చేరినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కూడా ఈడీ అధికారులు కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర కీలకంగా ఉందని తెలిపింది. 
 
ఈ గ్రూపునకు లాభం కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించినట్టు తెలిపింది. లిక్కర్ స్కాంలో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించినట్టు పేర్కొంది. ఈ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైదరాబాద్ నగరంలో భూములు కొనుగోలు చేసినట్టు ఈడీ తన చార్జిషీటులో పేర్కొంది. 
 
ఈడీ మూడో చార్జిషీటులో ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై కూడా చార్జిషీట్ పేర్కొంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరును కూడా చార్జిషీటులో ప్రస్తావించింది. మరోవైపు, ఆడిటర్ బుచ్చిబాబు మార్చి 28వ తేదీన ఈడీ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కవిత ఆదేశం మేరకే భూములు కొనుగోలు జరిగినట్టు పేర్కొంది.