ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (10:11 IST)

తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణపై 5.9 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం పగలు అత్యధికంగా భద్రాచలంలో 27.8 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది.

అత్యధికంగా మహబూబాబాద్‌, బయ్యారంలో 11, దొంగల ధర్మారం (మెదక్‌) లో 10.7, దహేగాం (కుమురం భీం జిల్లా) లో 10, మెదక్‌, బూర్గుంపాడులో 9, పెగడపల్లి (జగిత్యాల) లో 8, ఇల్లెందులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీల వరకూ తగ్గడంతో వాతావరణం చల్లబడింది.