తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సహం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం తెలంగాణ కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సహం నింపుతోంది. రెండున్నరేళ్లుగా తమను పట్టించుకొనే నాయకుడే లేడని డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇప్పటికే నియోజకవర్గంపై కన్నేసిన నేతలతో పాటు కొత్తగా పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయనే ప్రచారం కాంగ్రెస్‌లో ఊపు తీసుకొచ్చింది.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు భూపాలపల్లిలో పట్టు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఏఐఎ్‌ఫబీ నేత గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మొదటి నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి పట్టుంది. 2009లో నియోజకవర్గంగా భూ పాలపల్లి ఏర్పడింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి 10 వేల పైచీలుక ఓట్ల మెజారిటీతో అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారిపై విజ యం సాధించారు.
2014లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి త న ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డిపై 9 వేల పైచీలుక ఓట్లతో గెలిచారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిరికొండ మధుసూదనాచారి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎ్‌ఫబీ) అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ రెండోస్థానంలో నిలిచారు. అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మూడుసా ర్లు ఎన్నికలు జరగ్గా రెండు సార్లు కాంగ్రె్‌సనే ప్రజలు ఆదరించారు. అయి తే 2019 ఫిబ్రవరి 27న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెం కటరమణారెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరా రు.
గండ్ర వెం కటరమణారెడ్డితో పాటు అప్పటి కాంగ్రెస్ కేడర్ చాలా వరకు టీ ఆర్‌ఎ్‌సలోకి చేరింది. అత్యధికులు ఎమ్మెల్యేతో పాటే కారు ఎక్కడంతో భూపాలపల్లిలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయిందనే భావ న ఏర్పడింది.
పాత తరం కాం గ్రెస్ నేతలతో పాటు కొంత మంది కొండా మురళి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి అభిమానులు మాత్రం కాంగ్రె్‌సలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యం లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంతో భూపాలపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహం కనిపిస్తోంది.