సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మార్చి 2023 (14:57 IST)

బీటెక్ విద్యార్థిని హత్య కేసు - నిహారికకు బెయిల్ - జైలు నుంచి రిలీజ్

niharikabail
తెలంగాణాలో అబ్దుల్లాపూర్ పేట బీటెక్ విద్యార్థి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన ప్రియురాలి కోసం స్నేహితుడిని మరో స్నేహితుడు దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో హరికృష్ణతో పాటు అతని స్నేహితుడు హాసన్, ప్రియురారు నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నిహారిక రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని విచారించిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 
 
నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌‌కు.. అదే కళాశాలలో చదువుతున్న హరిహరకృష్ణతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. విషయం తెలుసుకుని ఇరువురు కొద్దిరోజులుగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో తను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. 
 
దాని ప్రకారం గత నెల 17వ తేదీన ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. నవీన్‌ తీవ్రంగా గాయపరిచిన హరిహరకృష్ణ... అతడి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అత్యంత కిరాతంగా నవీన్‌ తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి, మర్మాంగాలు కోసేశాడు. పేగుల బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఆపై అక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్లిన హరిహరకృష్ణ హత్య గురించి చెప్పాడు. ప్రియురాలికి కూడా చెప్పడంతో పోలీసుల ఎదుట లొంగిపొమ్మని సూచించింది. చివరకు తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల వద్ద హరిహరకృష్ణ లొంగిపోవడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.