శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:25 IST)

పీసీసీ చీఫ్‌గా ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు : రేవంత్ రెడ్డి

revanth reddy
తాను తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పొత్తు ఉండదని టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెల ముందే అభ్యర్థులను పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సీఎం కేసీఆర్‌‍ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఆయన మంగళవారం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది ప్రజలు కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీతో చేయి కలిపి కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్నాడని, బీజేపీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తమకు 80 సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. 80 సీట్లు కంటే తక్కువ ఇస్తే ప్రజలకే నష్టమన్నారు. 
 
ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 25 సీట్ల కంటే తక్కువగానే వస్తాయని తెలిపారు. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఈసారి కరీంనగర్‌లో పోటీ చేసి గెలవగలరా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.