త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్
త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేటలో నిర్మించిన నూతన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 34వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ గ్రంథాలయ భవనంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇక్కడ మహిళల కోసం వనిత, చిన్నారుల కోసం కామిక్స్, ఉర్దూ పుస్తకాల కోసం ప్రత్యేక రూములు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని, యువత వీటిని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.