శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (12:21 IST)

తెలుగు చానెల్‌లో అశ్లీల దృశ్యాలు ప్రసారం

tvview
హైదరాబాద్ నగరంలో ఓ తెలుగు చానెల్‌లో అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఆదివారం అర్థరాత్రి ఈ చానెల్‌లో బ్లూఫిల్మ్ దృశ్యాలు ప్రసారం కావడంతో వీక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలు ఏకంగా 15 నిమిషాల పాటు టెలికాస్ట్ అయ్యాయి. దీంతో షాకైన నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు చేపట్టి, తక్షణం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తమది లైవ్ చానెల్ అని, అర్థరాత్రి దాటిన తర్వాత 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమైనట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసిన ఈ పనికి పాల్పడివుంటారని వారు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది తక్షణం ఆ అశ్లీల దృశ్యాలను తొలగించిందని వెల్లడించారు. 
 
తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. బంజార్ హిల్స్‌ రోడ్ నెంబరు 12లో ఎమ్మెల్యే కాలనీ నుంచి ఈ చానెల్ నిర్వహణ కార్యకలాపాలు సాగిస్తున్నారు.