శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:34 IST)

పవన్‌ నీ రెమ్యునరేషన్‌ 10 కోట్లా.. 50 కోట్లా?: పోసాని కృష్ణమురళి

జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ... పవన్‌ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని ఆయన ఆరోపించారు.

'పవన్‌ నీ రెమ్యునరేషన్‌ 10 కోట్లా.. 50 కోట్లా?' అని ప్రశ్నించారు. పవన్ సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు.  అదే నేను ఒక్క సినిమా రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా?

ఆయన చేసే సినిమాలోని హీరోయిన్‌ను, లోకేషన్‌, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్‌ చేసుకుంటాడు. తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్‌ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు.

సీఎం జగన్‌కు కులపిచ్చి ఉందని పవన్‌కల్యాణ్‌ నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. సినిమా ఫంక్షన్‌లో సీఎంను ప్రశ్నించడమేంటి అని నిలదీశారు. సాక్ష్యాలు లేకుండా పవన్‌ ప్రశ్నించడం సరికాదని పోసాని కృష్ణమురళి తప్పుబట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నడూ అమర్యాదకర వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.

ఆధారాలుంటే ప్రశ్నించడాన్ని ఎవరూ తప్పుపట్టరన్నారు. పవన్‌ తనే ప్రశ్నలు వేసుకుంటారు.. సమాధానం చెప్పుకుంటారని చెప్పారు. వేదికపై పవన్‌ మంత్రులను తిట్టడం సరైన పద్ధతి కాదని పోసాని దుయ్యబట్టారు.