PK టీమ్‌తో KCR భేటీ: మూడోసారి అధికారం కోసం కసరత్తు

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:15 IST)
దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్(పీకే)తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీకేతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్‌ సేవలు పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
దీంతో పాటు ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం పీకే టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం. పీకే టీమ్‌లో క్రియాశీలకంగా ఉండే ప్రియా రాజేంద్రన్.. షర్మిల పార్టీ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ అనేక సలహాలను అందజేశారు.

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments