శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (15:36 IST)

గద్వాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే ఇంట్లోనే స్టే

తెలంగాణ సీఎం కేసీఆర్ గద్వాలలో పర్యటిస్తున్నారు.   సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వెంక‌ట్రామిరెడ్డి ఇటీవ‌ల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. కృష్ణ‌మోహ‌న్ రెడ్డి తండ్రి వెంక‌ట్రామిరెడ్డి చిత్ర‌ప‌టానికి కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 
 
అనంత‌రం కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి ఓదార్చారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే ఇంట్లోనే బస చేస్తున్నట్లు సమాచారం.