Daily Horoscope
✕

రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో వర్షాలు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 22 మే 2022 (09:31 IST)
రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
రాయలసీమ ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని, దీనికితోడు బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదలుతున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. అలాగే, బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శనివారం కుమరంభీం జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments