మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (12:48 IST)

త్వరలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు సర్వీస్

Bharat Express
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా విశాఖపట్టణం వరకు ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. త్వరలోనే మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తుంది. వచ్చే నెలలో ఈ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ రైలు దేశంలో నడుపనున్న తొమ్మిదో వందే భారత్ రైలు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. వచ్చేనెల 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలు సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందుకోసం రూట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా, ఒంగోలుకు రూ.5.20 గంటలకు, చీరాలకు రూ.6.25 గంటలకు విజయవాడకు 8.25 గంటకు చేరుకుంది.