బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (16:04 IST)

హైదరాబాదులో కొత్త రకం ఫీవర్... క్యూ జ్వరం లక్షణాలు..

fever
హైదరాబాదులో కొత్త రకం ఫీవర్ నగర వాసులను వణికిస్తోంది. క్యూ ఫీవర్‌గా చెప్పుకునే  కొత్తరకం జ్వరం కలవరపాటుకు గురిచేస్తుంది. కబేళాల నుంచి ఈ తరహా ఫీవర్లు వస్తాయని.. వాటికి దూరంగా వుండాలి వైద్యులు చెప్తున్నారు. 
 
హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఈ మేరకు సెరోలాజిక్ టెస్టులు నిర్వహించింది. టెస్టుల్లో భాగంగా 250 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో ఐదుగురు మాంసం విక్రేతలకు క్యూ జ్వరం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. 
 
క్యూ జ్వరం లక్షణాలు.. 
క్యూ జ్వరం అనేది గొర్రెలు, మేకలు, పశువుల వంటి జంతువుల నుంచి వ్యాపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. క్యూ జ్వరం ఉన్న వ్యక్తులు సాధారణంగా జ్వరం, కండరాల నొప్పి, అలసట, చలి వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. 
 
వ్యాధి సోకిన జంతువు ద్వారా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ఈ వైరస్ సోకుతుంది. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించటం ఉత్తమమని వైద్య నిపుణులు చెప్తున్నారు.