Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ స్కూళ్ల వ్యాపారం.. పోరాటం చేస్తోన్న శివబాలాజీ దంపతులు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (17:10 IST)
ShivaBalaji
ప్రైవేట్ స్కూళ్ల వ్యాపారంపై సినీ నటుడు శివ బాలాజీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూళ్ల ఫీజులతో కరోనా కాలంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని శివ బాలాజీ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని వాపోయారు. వ్యక్తిగతంగా వెళ్లినా, మెయిల్స్ పెట్టినా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 
 
మౌంట్ లితేరా స్కూలు నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయన్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని, తనకు వేరే పని లేదని, ఇదే పనిగా పెట్టుకుంటానన్నారు. 
 
శివబాలాజీ సతీమణి మధుమిత మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రిపై గౌరవంతో అడుగుతున్నామని.. ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని గుర్తు చేశారు. తాము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. పూర్తి ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

అన్నీ చూడండి

చిరంజీవి గారి వల్లే డాన్సర్స్ సమస్య లకు న్యాయం జరుగుతుంది : సుమలత

Karthi: ఏజెంట్ బోస్ గా కార్తీ నటించిన సర్దార్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

NBK111 ఫ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి

తర్వాతి కథనం
Show comments