సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (15:05 IST)

లిక్కర్ స్కామ్‌‌.. కవితకు సీబీఐ నోటీసులు.. కేసీఆర్‌తో భేటీ

kavitha
లిక్కర్ స్కామ్‌‌లో ఇప్పటికే  సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కవిత కలిశారు. కేసీఆర్‌తో ప్రగతి భవన్‌‌లో కవిత భేటీ అయ్యారు. 
 
నోటీసులపై న్యాయపరంగా, రాజకీయ పరంగా ఏం చేయాలనే దానిపై ఆమె కేసీఆర్‌తో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.  
 
అలాగే తాజా పరిణామాలపై సోదరుడు, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు, ఇతర కుటుంబ సభ్యులతో ఆమె చర్చించే అవకాశం ఉంది.
 
మరోవైపు కవితకు సీబీఐ నోటీసు జారీ చేసిన వార్త వినగానే ఆమెకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు.