గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:19 IST)

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్... తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణపై...

kcrao
తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతోంది. కేబినెట్ భేటీకి మంత్రుల‌తో పాటు ప‌లువురు అధికారులు హాజ‌ర‌య్యారు.  
 
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.