శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (11:13 IST)

ఇవాంకా కోసం ప్రత్యేక బహుమతులు.. అన్నీ కరీంనగర్ నుంచే

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు విలువ చేసే కానుకలు ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు విలువ చేసే కానుకలు ఇవ్వనుంది. ఇందుకోసం రూ.40 లక్షలు వెచ్చించి కరీంనగర్ ఫిలిగ్రీలో ప్రత్యేక కానుకలు తయారు చేయించింది.
 
మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇక్కడ రూపొందించిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్టికల్స్‌నే కానుకలుగా ఇచ్చారు. ఇందులో చారిత్రక చార్మినార్, కాకతీయుల కళాతోరణం, జాతీయపక్షి నెమలి, వీణ, హంస జ్ఞాపికలను రూ.40 లక్షల వ్యయంతో ప్రభుత్వం తయారుచేయించింది. వీటినే ఇవాంకాకు కూడా అందజేయనుంది.
 
ఇకపోతే, పారిశ్రామికవేత్తల సదస్సుకు దేశ, విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు అందజేసేందుకు సీఎం కేసీఆర్ తన అభిరుచికి తగినట్టు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులను తయారు చేయించారు. మూడు కిలోల వెండితో 18 అంగుళాల చార్మినార్‌ను రూ.2.50 లక్షలతో, 4 కిలోల వెండితో 20 అంగుళాల పొడువున కాకతీయ కళాతోరణం, నెమలి, వీణ, హంస జ్ఞాపికలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. వీటిని ప్రతి అతిథికి ఇవ్వనుంది.