శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:48 IST)

వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?

Mutton Piece
మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు హరించింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటి వద్ద వివాహ వేడుక జరిగింది. ఇందులో రమణ గౌడ్ (45) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా, అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో మాటరాక, ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కేవలం మటన్ ముక్క ఇరుక్కోవడమే కాకుండా, గుండెపోటు, గ్యాస్ట్రిక్ సమస్య కూడా మరో కారణమని వైద్యులు చెప్పారు. రమణ గౌడ్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, గతంలో తెలంగాణాలో ఓ బాలుడి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.