శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణలో కరోనా.. రికవరీల్లో రికార్డ్.. ఒక్కరోజే 146 మంది కోలుకున్నారు..

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే రికవరీల్లో మాత్రం జాతీయ సగటు కంటే మిన్నగా రికార్డు సాధించింది. గ్రేటర్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతోంది. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,598కి చేరింది. 
 
కరోనా బారిన పడి శనివారం ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. తద్వారా మరణాల సంఖ్య 1,624కు పెరిగింది. కరోనా మరణాల్లో జాతీయ సగటు 1.4శాతంకాగా, తెలంగాణలో మాత్రం అది 0.54శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.   
 
కోవిడ్ వ్యాధి నుంచి శనివారం ఒక్కరోజే 146 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా 2,94,243 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. జాతీయ స్థాయిలో కొవిడ్ రికవరీ రేటు 97.2శాతం కాగా, తెలంగాణలో మాత్రం రికవరీ రేటు 98.87 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి.