శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 3 మే 2021 (20:49 IST)

తెలంగాణాలో మూడు వ్యాక్సిన్లు, బారులు తీరుతున్న ప్రజలు

వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అందుకు కారణం అవసరమైనన్ని వ్యాక్సిన్స్ లేకపోవడమే. అయితే ఆ పరిస్థితిని అధిమించనుంది తెలంగాణా ప్రభుత్వం. ప్రత్యేక విమానాంలో మాస్కో నుంచి హైదరాబాద్‌కు వ్యాక్సిన్ చేరుకుంది.
 
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు లక్షా 50 వేల డోసులు చేరుకున్నాయి. అంతేకాకుండా ఈ నెలలోనే మరో మూడు మిలియన్ డోసుల టీకా కూడా రానున్నాయట. గత నెలలోనే అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించింది. 50 మిలియన్ డోసులకు రష్యా కంపెనీతో భారత్ ఒప్పందం కూడా కుదుర్చుకుందట.
 
స్పుత్నిక్ వి రాకతో ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చింది.
 
అయితే మూడురకాల వ్యాక్సిన్లు తెలంగాణా రాష్ట్రంలో అందుబాటులో ఉండడంతో పాటు ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కానీ ప్రస్తుతం రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్‌తో కొరత తీరుతుందన్న అభిప్రాయంలో రాష్ట్రప్రభుత్వం ఉంది.