Biodata Maker

నల్గొండలో కూలిన ట్రైనీ హెలికాఫ్టర్ - ఇద్దరు మృతి

Written By ఠాగూర్
Updated: శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ ట్రైనీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలోని రామన్నగూడెం తండా వద్ద సంభవించింది. 
 
ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పైగా, ఈ హెలికాఫ్టర్ కిందపడగానే తునాతునకలైపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలెట్‌‍తో సహా ట్రైనింగ్ పైలెట్లు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు, వైద్యులు, రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్ విద్యుత్ స్తంభంపై కూలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు స్థానికులు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

Keerthy Suresh: డోరతీ ప్రీమియర్ లో కీర్తి సురేష్‌కు ఘనస్వాగతం పలికిన టొరంటో

Samyuktha: పూరిజగన్నాధ్, రామ్ పోతినేని చిత్రాల్లో నటిస్తూ పుట్టినరోజు చేసుకున్న సంయుక్త మీనన్

Naga Chaitanya: ఫౌజీ తో తలపడుతున్న నాగ చైతన్య వృషకర్మ చిత్రం

Mahendragiri Varahi Review: ఆకట్టుకోని సుమంత్ చిత్రం మహేంద్రగిరి వారాహి రివ్యూ

Varun Tej : వాయువ్ ముఖాన్ని చూపిస్తూ అందమైన జీవితంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పోస్ట్

తర్వాతి కథనం
Show comments