గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (18:38 IST)

ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు.. తెలంగాణ సర్కార్ అదుర్స్

తెలంగాణ సర్కారు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు.  
 
ఈ సందర్భంగా రూత్ జాన్‌పాల్ మాట్లాడుతూ.. తాను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసానని..  తనకు ఉద్యోగం లభించడం గగనమైందన్నారు. హైదరాబాదులో 15 ఆస్పత్రులు తనను తిరస్కరించాయని తెలిపారు. 
 
తన  ఐడెంటిటీ బయటపడ్డాక, తన విద్యార్హతను పట్టించుకోలేదని చెప్పారు.  ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ.. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఆ ఆస్పత్రి యాజమాన్యం తనతో చెప్పిందన్నారు.