సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (19:11 IST)

9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణం, రోగి కోసం గ్రీన్ కారిడార్

అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు.

ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో గ్రీన్‌ కారిడార్ ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరవేసి ఆ బాధితుడికి సకాలంలో వైద్యం అందేలా చేశారు.పోలీసులు, వైద్య సిబ్బంది కృషిని పలువురు అభినందిస్తున్నారు.