శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (17:28 IST)

రేపు TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు‌గాను
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ ప్రతినిధుల సమావేశం ఆదివారం జరగనుంది. 
 
ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకానున్నారు. 
 
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై అనుసరించాల్సిన పంథాపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు.